మిస్ యూనివర్స్ 2025 విజేత మెక్సికో భామ ఫాతిమా.. భారత్కు తప్పని నిరాశ

మిస్ యూనివర్స్ 2025 విజేత మెక్సికో భామ ఫాతిమా.. భారత్కు తప్పని నిరాశ

మిస్ యూనివర్స్ 2025 విజేతను ప్రకటించారు. మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ 74వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. భారతదేశానికి చెందిన మణిక విశ్వకర్మ టాప్ 12లో చోటు కోల్పోయింది. మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ 100 మందికి పైగా పోటీదారులను ఓడించి 74వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకోగా, థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ రన్నరప్‌గా టైటిల్‌ను గెలుచుకుంది. 73వ మిస్ యూనివర్స్గా 2024లో గెలిచిన డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ముగింపు పోటీల్లో మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని విజేతకు బహుకరించారు.

ఫైనలిస్టులలో చిలీ, కొలంబియా, క్యూబా, గ్వాడెలోప్, మెక్సికో, ప్యూర్టో రికో, వెనిజులా, చైనా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మాల్టా మరియు కోట్ డి ఐవోయిర్ దేశాలు పోటీ పడ్డాయి. థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ మిస్ యూనివర్స్ 1వ రన్నరప్‌గా నిలిచింది. వెనిజులాకు చెందిన స్టెఫానీ అబాసాలి 2వ రన్నరప్‌గా నిలిచింది. 3వ రన్నరప్, 4వ రన్నరప్ టైటిళ్లను ఫిలిప్పీన్స్‌కు చెందిన అహ్తిసా మనలో, ఐవరీ కోస్ట్‌కు చెందిన ఒలివియా యాకే గెలుచుకున్నారు.