మిస్ యూనివర్స్ 2025 పోటీలు ఎందుకు అంత ప్రతిష్టాత్మకమైనవిగా నిలిచాయంటే.. దేశానికి గర్వ కారణంతో పాటు విజేతకు విలాసవంతమైన జీవితం ఆమె సొంతమవుతుంది. విజేత ప్రైజ్ మనీ సుమారు రూ. 2.2 కోట్లు. అంతేకాదు.. మిస్ యూనివర్స్ 2025 టైటిల్ గెలుచుకున్న విజేతకు 50 వేల డాలర్ల నెల వారీ వేతనం కూడా అందుతుంది. ఆమె ప్రయాణ ఖర్చులు మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ భరిస్తుంది. విలాసవంతమైన న్యూయార్క్ నగరంలో ఒక ఖరీదైన ఇల్లు కూడా విజేతకు దక్కుతుంది.
వీటన్నికంటే.. హైలైట్ ఏంటంటే.. 5 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 44 కోట్లకు పైగా విలువైన వజ్రాలు పొదిగిన కిరీటం మిస్ యూనివర్స్ 2025 తలపై వచ్చి చేరుతుంది. 2025 మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లో మొత్తం 121 దేశాలు పోటీపడ్డాయి. ‘ది పవర్ ఆఫ్ లవ్’ థీమ్తో ఈ మిస్ యూనివర్స్ 2025 పోటీలను నిర్వహించారు. సౌదీ అరేబియా, పాలస్తీనా, మొజాంబిక్ దేశాలు తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో నిలిచాయి.
మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ 74వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది, భారతదేశానికి చెందిన మణిక విశ్వకర్మ టాప్ 12లో చోటు కోల్పోయింది. మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ 100 మందికి పైగా పోటీదారులను ఓడించి 74వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకోగా, థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ రన్నరప్‌గా టైటిల్‌ను గెలుచుకుంది. 73వ మిస్ యూనివర్స్గా 2024లో గెలిచిన డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ముగింపు పోటీల్లో మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని విజేతకు బహుకరించారు.
