ఎమోషనల్ థ్రిల్లర్‌గా 'మిస్సింగ్ మేఘన'.. క్లైమాక్స్ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఎమోషనల్ థ్రిల్లర్‌గా 'మిస్సింగ్ మేఘన'.. క్లైమాక్స్ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక పర్ఫెక్ట్ సర్ప్‌రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది 'మిస్సింగ్ మేఘన'. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి వాచస్పతి దర్శకత్వం వహించారు.  ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్ థ్రిల్లర్.. సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించగా.. మొదటి పాట ''పిల్ల పిల్ల పిల్ల 'ను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, రెండో పాటను దిల్ రాజు, మూడో పాటను కోన వెంకట్ లాంచ్ చేశారు. ప్రముఖుల మద్దతుతో పాటు ఆర్.ఆర్. ధృవన్ అందించిన మెలోడీ సంగీతం, శామ్ కె. నాయుడు ఆకట్టుకునే విజువల్స్ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

ఇది సాధారణ థ్రిల్లర్ కాదు. రెండేళ్ల మా కష్టానికి ప్రతిరూపం. క్లైమాక్స్‌లో వచ్చే 'హుక్ పాయింట్' ప్రేక్షకులను తీవ్ర షాక్‌కు గురిచేస్తుంది అని దర్శకుడు వాచస్పతి ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్ బాగా రావడంతో బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నామని, త్వరలోనే పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేస్తామని నిర్మాత పంచుమర్తి నరేష్ తెలిపారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఒక ప్రముఖ పంపిణీ సంస్థ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ముందుకు రావడం విశేషం అని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.