టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిత్రో యాప్ ను తొలగించిన గూగుల్

టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిత్రో యాప్ ను తొలగించిన గూగుల్

భారత్ పై గూగుల్ అక్కసు వెళ్లగక్కుతోంది. చైనా యాప్ టిక్ టాక్ కు పోటీగా వచ్చిన దేశీయ యాప్ మిత్రో ను గూగుల్ స్టోర్ నుంచి తొలగించింది.

మన దేశంలో కరోనా మహమ్మారి, భారత్ – చైనా బోర్డర్ ఇష్యూ తో పాటు టిక్ టాక్ యాప్ హింసను ప్రేరేపించేలా ఉండడంతో చైనా వస్తువులను, యాప్స్ ను వినియోగించకూడదనే నినాదం తెర పైకి వచ్చింది. అందుకు మద్దతుగా మన దేశానికి చెందిన టిక్ టాక్ యూజర్లు, చైనా యాప్స్ వినియోగదారులు వాటిని తొలగిస్తున్నారు. చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలని నినదిస్తున్నారు.

అయితే టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిత్రో యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ నిబంధనలకు విరుద్దంగా మిత్రో యాప్ ఉందంటూ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే మిత్రో యాప్ నిర్వాహకులు గూగుల్ ను సవాల్ చేస్తూ, తాము గూగుల్ నియమావళిని ఉల్లంఘించ లేదనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మిత్రో యాప్ డెవలపర్స్ స్పందించారు.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం టిక్ టాక్ ను వ్యతిరేకిస్తూ భారతీయులు రేటింగ్ ఇచ్చారు.  దెబ్బతో 5 రేటింగ్ ఉన్న యాప్ 1.2 రేటింగ్  కి చేరింది. దీంతో స్పందించిన గూగుల్ యాజమాన్యం భారీ ఎత్తున నెగిటివ్ కామెంట్స్ ను డిలీట్ చేయగా.. చైనా యాప్ రేటింగ్ యథాస్థానాన్ని సొంతం చేసుకుంది.