
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న గాయకుడు మిట్టపల్లి సురేందర్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో భేటి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో మిట్టపల్లి కలిశారు. ఈ సందర్బంగా బీజేపీలో చేరిక, పెద్దపల్లి సీటు కేటాయింపుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీ, మోదీపై పలు భాషల్లో పాటలు రాసిన మిట్టపల్లిని కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
గత కొంతకాలంగా మిట్లపల్లితో పార్టీ పెద్దలు చర్చలు జరుగుతుండగానే... బీజేపీ రాష్ట్ర నేతలు శ్రీనివాస్ గోమాసేను ఇటీవల పార్టీలో చేర్చుకున్నారు. వంద శాతం పెద్దపల్లి సీటు తనదేనని జాయినింగ్ అనంతరం శ్రీనివాస్ గోమాసే మీడియాకు వెల్లడించారు.