సర్వం సిద్దం .. రేపే ( నవంబర్ 7) మిజోరం అసెంబ్లీ ఎన్నికలు

సర్వం సిద్దం ..  రేపే ( నవంబర్ 7) మిజోరం అసెంబ్లీ ఎన్నికలు

మిజోరం అసెంబ్లీలోని 40 స్థానాలకు 2023 నవంబర్ 07న ఓటింగ్ జరగనుంది.  174 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 8.52 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.   మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది.  

ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం..  మిజోరంలో 8,52,088 మంది ఓటర్లు ఉన్నారు, ఇందులో 4,13,064 మంది పురుషులు, 4,39,028 మంది మహిళలు ఉన్నారు.  1,276 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు వేయనున్నారు. 18- నుంచి 19 ఏళ్లలోపు 50,611 మంది ఓటర్లు మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, 80 ఏళ్లు పైబడిన 8,490 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. 

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది .  రాష్ట్రంలోని 30 పోలింగ్‌ కేంద్రాలను కీలక పోలింగ్‌ కేంద్రాలుగా ఈసీ గుర్తించింది. దాదాపు 5000 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లలో నిమగ్నమై ఉన్నారు. CAPF రాష్ట్రంలో మోహరించింది. ఈసీ లెక్క ప్రకారం ప్రకారం, థోరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్ప సంఖ్యలో ఓటర్లు 14,924 ఉన్నారు. ఇక  36,041 మంది ఓటర్లతో తుయిచాంగ్ నియోజకవర్గం అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం.