తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్టాలిన్ శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డికి  స్టాలిన్ శుభాకాంక్షలు

ఇవాళ తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న  రేవంత్ రెడ్డికి తమిళనాడు సీఎం  స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.  పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రేవంత్ తో ఫోన్ లో కూడా స్టాలిన్ మాట్లాడారు.  కాగా రేవంత్  ప్రమాణస్వీకారానికి స్టాలిన్ కూడా ఆహ్వానం పంపారు. కానీ తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టి్ంచడంతో ఆయన హాజురు కావడం లేదు.  

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మధ్యాహ్న ఒంటిగంట నాలుగు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఆయనతోపాటు 12 మంది మంత్రులు కూడా అదే వేదికపై ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణం చేస్తుండగా.. మంత్రులుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రేమసాగర్ రావు ఉన్నారు. 

నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల, పొంగులేటికి అవకాశం దక్కింది. ఇక వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రిగా అవకాశం లభించింది.