- విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రంజాన్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ తరఫున గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ త్యాగం, సహనం, దయ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుల్కం రాజు, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల, వెలుగు: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న మూడు మహిళా సమైక్య సంఘాల బిల్డింగ్, రాజారాం తండాలో జీపీ బిల్డింగ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెగ్గెర్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం, పాత హనుమాన్ జాతరలో విప్ పాల్గొన్నారు.
