నువ్వు ఏమైనా కాంగ్రెస్ పార్టీని కొన్నవా!

నువ్వు ఏమైనా కాంగ్రెస్ పార్టీని కొన్నవా!

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. వీహెచ్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చోని డైరెక్షన్ చేస్తావా..మీడియా ముందు ఎందుకు టెంప్ట్ అయ్యావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోనియా, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కి లేఖ రాస్తానని చెప్పారు.

రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే పడేందుకు ఇక్కడ ఆయన నౌకర్లు ఎవరూ లేరన్నారు. వీ. హన్మంతరావు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాని కలవడంలో తప్పులేదన్నారు. యశ్వంత్ సిన్హాను ఎయిర్ పోర్టులోనే వీహెచ్ కలిసిరాని, సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర కాదన్నారు. రాహుల్ గాంధీకి లేని అభ్యంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ కు ఎందుకు వచ్చిందని నిలదీశారు. యశ్వంత్ సిన్హాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల భేటీ విషయంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.