పవర్‌తో పెట్టుకుంటే పవర్‌ లేకుండా పోతారు

పవర్‌తో పెట్టుకుంటే పవర్‌ లేకుండా పోతారు

టీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతుల మేలు కోసం పాటుపడుతున్నదన్నారు పీయూసీ చైనర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న విద్యుత్‌ బిల్లుపై గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లుతో రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తొలగించేందుకే ప్ర‌ధాని మోడీ విద్యుత్ బిల్లు ను తెస్తున్నారన్నారు. ఫెడరల్ స్ఫూర్తి ని మోడీ ని మంట గలుపుతున్నార‌ని అన్నారు.

పవర్‌తో పెట్టుకుంటే పవర్‌ లేకుండా పోతారని బీజేపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి. చంద్రబాబు కరెంటు తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్ కు రెండు సార్లు పవర్ తెచ్చింది పవరే(కరెంటు ) న‌ని ఆయన అన్నారు. కేంద్రీకృత విద్యుత్ చట్టం పై మోడీ చూపిన శ్రద్ద.. వలస కార్మికుల పై చూపలేకపోయారన్నారు . వలస కార్మికుల ఉసురు మోడీ కి తగులుతుందని, మోడీ కి ధైర్యం ఉంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వం, సబ్సిడీలు ఇవ్వం అని బహిరంగంగా చెప్పాలన్నారు.

కేంద్రం అంటే బీజేపీ జాగీరా ? అని ప్ర‌శ్నించారు జీవ‌న్ రెడ్డి. బీజేపీ అంటే భారతీయ బోగస్ పార్టీ అని అన్నారు. కేంద్రం లో మోడీ, లోకల్ గా బీజేపీ కేడీలు మాట్లాడుతున్నార‌న్నారు. దమ్ముంటే బీజేపీ స్థానిక కేడీ లు పసుపు బోర్డు తేవాలన్నారు. నిజామాబాద్ ఎంపీ ఓ ఫేక్ ఎంపీ అని, బోగస్ డిగ్రీ తెచ్చుకున్న ఎంపీ అని ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీద ప్రేముంటే బీజేపీ నేతలు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించాలన్నారు. మిషన్ భగీరథ కు డబ్బులు తెప్పించాలన్నారు. సంక్షేమం అంటే మోడీ కి పడద‌ని, ఒక్క సంక్షేమ పథకం కూడా మోడీ హయాంలో అమలు కాలేదన్నారు.

విద్యుత్ బిల్లు పై దక్షిణాది రాష్ట్రాలు ఉద్యమించబోతున్నాయని చెప్పారు జీవ‌న్ రెడ్డి. కేసీఆర్ కరెంటు అంశం పైనే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారన్నారు. ఇపుడు కూడా దేశమంతా రైతులను కూడగడుతామ‌ని, కేసీఆర్ ముందుండి కొట్లాడుతారన్నారు. ఇప్పటికైనా మోడీ విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేకపోతే బీజేపీ కి మిగిలేది గుండు సున్నే అని ఆయ‌న అన్నారు.

MLA Jeevan Reddy Press Meet at TRS LP Office