బీసీ రిజర్వేషన్ల పై మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ కు లేదు

బీసీ రిజర్వేషన్ల పై మాట్లాడే  అర్హత బీజేపీ, బీఆర్ఎస్ కు లేదు
  • ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు బీజేపీ, బీఆర్ఎస్ కు లేదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. 

అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించి, అగ్రవర్ణాలకు అవకాశం ఇవ్వడంతోనే  బీజేపీ వైఖరి ఏంటో తేలిపోయిందని చెప్పారు. ఇక బీఆర్ఎస్..  బూతులకు కేరాఫ్  అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. బూతులను కేసీఆర్  పరిచయం చేస్తే, కేటీఆర్  ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు.