గన్నేరువరం, వెలుగు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం మానకొండూరు ఎమ్మెల్యే, కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. రాజేందర్ ఇంటికి వెళ్లి ఆయన ఋఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చి, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజేందర్ రెడ్డి పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
