భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దళారులు ఉచ్చులో పడి రైతులు ఆర్థికంగా నష్టపోవద్దని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తొందన్నారు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగదు చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో తహసీల్దార్ శిరీష, కృష్ణ పాల్గొన్నారు.

