V6 News

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే నాగరాజు

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట, వెలుగు: ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో  ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన వరంగల్​కలెక్టర్ సత్య శారదాదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో మెరుగు రమ–రాజాకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు.

పర్వతగిరి మండల పరిధిలోని రావూర్, అన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, చెరువుముందు తండాలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ​అనంతరం నారాయణపురం గ్రామం కమ్మరికుంటతండాలో నునావత్​ నీలా– రమేశ్​కు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ శాఖల ఆఫీసర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.