అభివృద్ధి కోసం సీఎంని కలిస్తే తప్పేంటి..?: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్

అభివృద్ధి కోసం సీఎంని కలిస్తే తప్పేంటి..?: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్
  • మాజీ మంత్రి జోగు రామన్న అక్రమాలు అందరికీ తెలుసు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కలిస్తే తప్పేంటని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే  పాయల్​శంకర్​ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగు రామన్న అక్రమాలు అందరికీ తెలుసని ఫైర్​అయ్యారు. శుక్రవారం బీజేపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  

పదేండ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయకుండా కేవలం కమీషన్లు దండుకొని అక్రమసంపాదనకు అలవాటు పడిన ఆయన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 30 ఏండ్లుగా మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని ప్రయత్నిస్తుంటే సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి, ఎమ్మెల్యే కలిసి అమ్ముతున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జిల్లాకు ఎయిర్ పోర్ట్ తేవడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సీఎం రేవంత్ ను కలిసి కోరితే ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రఘుపతి, జోగు రవి, దినేశ్​మటోలియా,  భరత్, ధోని జ్యోతి, రాకేశ్​, కృష్ణ. భీమ్ సేన్ రెడ్డి, మోహన్ అగర్వాల్, రాజేశ్ ​పాల్గొన్నారు.