బాన్సువాడ, వెలుగు: ఈ నెల 7న బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను గుర్తించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. వారి కోసం బస్సును ఏర్పాటు చేయించారు. కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీకి వచ్చే విద్యార్థుల ఇబ్బందులను తొలగిస్తూ శుక్రవారం బస్సు సౌకర్యం కల్పించారు. బస్సును ప్రారంభించి విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గంగాధర్, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
