కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం

బీఆర్ఎస్ పార్టీకి  బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సగౌవరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ..  రైతుల అభివృద్ధి కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నామని అన్నారు సీఎం రేవంత్.  రైతులకు సహకరించే ప్రతి ఒక్కరికి స్వాగతమని చెప్పారు.  రైతుల బాగుకోసం పోచారం ఇచ్చిన సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.  బాన్సువాడ నియోజకవర్గ అభివృద్థికి సహకరిస్తామని అన్నారు.