తెలంగాణలో బీజేపీకి ఫైటర్ కావాలి: రాజాసింగ్

తెలంగాణలో  బీజేపీకి ఫైటర్ కావాలి: రాజాసింగ్

తన రాజీనామా వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.అన్ని ఆలోచించే రాజీనామా చేశానన్నారు.   తాను మళ్లీ బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం లేదని చెప్పారు.  తనకు అమిత్ షా ఎలాంటి ఫోన్ చేయలేదన్నారు రాజాసింగ్. రామచందర్ రావు మంచి రైటర్..కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఫైటర్ కావాలని వ్యాఖ్యానించారు. మీడియాకు లీకులు,ఫేక్ వార్తలు ప్రసారం చేయించే  అలవాటు తనకు లేదని..అలాంటి చిన్న  ఆలోచన చేయనన్నారు రాజాసింగ్.

కాంగ్రెస్ లో చేరను

బీజేపీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ఇటీవలే వ్యాఖ్యానించారు.  తాను ఏ పార్టీలో చేరబోనన్నారు. తన ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి ఫ్రీడమ్ ఇస్తే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు. గోషామహల్ బీజేపీ అడ్డా అని, ఇప్పటికైతే అక్కడ ఎలాంటి ఉప ఎన్నిక రాదన్నారు. కానీ, తనను రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. లక్షలాది కార్యకర్తల అభిప్రాయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, కానీ ఇందులో ఫెయిల్ అయ్యానన్నారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.  అయితే, మోదీ, అమిత్ షా, యోగి కార్యక్రమాలను ప్రచారం చేస్తానని చెప్పారు. ధర్మ ద్రోహానికి పాల్పడే ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌‌ఎస్.. ఎంఐఎంను నెత్తిన పెట్టుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోందని, అలాంటి పార్టీలో చేరలేనన్నారు. 

రాజా సింగ్ జూన్ 30న  బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం.. మీ  పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.