
వెండి తెరపై అభిమానులను ఎంతగానో అలరిస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. రియల్ లైఫ్ లో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పి.. తన మంచి తనాన్ని చాటుకున్నాడు. దీంతో ప్రతి ఒక్కరూ సూపర్ స్టార్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా జబర్దస్త్ జడ్జి, ఎమ్మెల్యే రోజా కూడా మహేష్ బాబు మంచి మనసు పై ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు తాజా ఛారిటీ పై రోజా ఒక వీడియో ను విడుదల చేసింది. చిన్నారుల గుండె చప్పుడు వింటున్న నీకు రియలీ హ్యట్సాఫ్ అంటూ మెచ్చుకున్నారు. హీరోగా అలరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా మెప్పిస్తున్నాడు అని రోజా సూపర్ స్టార్ ను ఆకాశానికెత్తింది.
❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. ??? pic.twitter.com/OwXtyz33GD
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022