"నేను చాలా ఓపెన్ గా మాట్లాడుతా అందుకే నాకిన్ని చిక్కులు వస్తున్నాయి" అని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గీత విద్యాలయం దగ్గర ఆయన చత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తాను హిందువుగా జన్మించినందుకు గర్విస్తున్నానని చెప్పారు. దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా హిందూ దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తాను అన్ని వర్గాల వారితో కలిసి ఉంటానని, ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలని సూచించారు..ఇతర మతాలను దూషించరాదని కోరారు.
