ఆశా వర్కర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తా: ఎమ్మెల్యే శ్రీగణేశ్

ఆశా వర్కర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తా: ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఆశా వర్కర్లు శనివారం ఎమ్మెల్యే శ్రీగణేశ్​ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుందని, వారి న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లు యాదమ్మ, కృష్ణవేణి, భాగ్యలక్ష్మి, మీనా పాల్గొన్నారు.