పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత..

పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత..

సూర్యాపేట జిల్లా   పులిచింతల ప్రాజెక్ట్   దగ్గర ఉద్రిక్త  పరిస్థితి ఏర్పడింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను.. కార్యకర్తలతో  కలిసి  ప్రాజెక్ట్ దగ్గరకు  చేరుకున్నారు. పులిచింతలలో  విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని.. నిరసన  తెలిపేందుకు   ప్రయత్నించడంతో.. పోలీసులు  అడ్డుకున్నారు. భారీ కేడ్లు పెట్టి.. ప్రాజెక్ట్   దగ్గరకు వెళ్లడానికి  అనుమతి లేదన్నారు.   దీంతో.. పోలీసులతో  వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే  ఉదయభాను.