నా తండ్రి నేర్పిన క్రమశిక్షణతోనే ఈ స్థాయిలో ఉన్నా... చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నా తండ్రి నేర్పిన క్రమశిక్షణతోనే ఈ స్థాయిలో ఉన్నా... చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • నా తండ్రి నేర్పిన క్రమశిక్షణతోనే ఈ స్థాయిలో ఉన్నా
  • పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: తన తండ్రి కాకా వెంకటస్వామి పెంపకంలో చూపిన క్రమశిక్షణ, సమాజం పట్ల ఆయనకు ఉన్న విజన్.. తాను వ్యాపారవేత్తగా, పొలిటీషియన్‌‌‌‌గా రాణించడానికి ఎంతో దోహదపడ్డాయని చెన్నూరు కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన స్ఫూర్తితోనే బ్యాక్ టు సొసైటీ కింద తాను సంపాదించిన దానిలో కొంత విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్‌‌‌‌లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య, ఏపీలోని చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు, ఐపీఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ చేతనతో కలిసి వివేక్ పాల్గొని మాట్లాడారు.

పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ట్రస్ట్ చైర్మన్‌‌‌‌ బాలకృష్ణ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వృద్ధిలోకి వస్తారని చెప్పారు. దళితుల అభ్యున్నతికి తాను ఎప్పుడూ ముందుంటానని, గతంలో రైతు బంధు విషయంలో కౌలు రైతులకు వర్తింపజేయాలని మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో కొట్లాడానన్నారు. దళితులకు భూమి ఉండదు కాబట్టి వారికి ఇవ్వాలని పట్టుబట్టినట్లు, ఈ విషయంలోనే తనకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు గ్యాప్ వచ్చిందని గుర్తుచేశారు. దళితులు ఏ రంగంలో ఉన్నా.. వారు అభివృద్ధి చెందేందుకు తాను చేయూత అందిస్తానని వివేక్ స్పష్టం చేశారు.