యుద్ధప్రాతిపదికన తాత్కాలిక వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశం

యుద్ధప్రాతిపదికన తాత్కాలిక వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశం

చెన్నూరు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతానని అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ శివారులో జూలై 15 2024 రాత్రి కురిసిన వర్షానికి వంతెన కొట్టుకపోయింది. దీంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచపోయాయి. విషయం తెలుసుకున్న  వెంటనే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు. యుద్ధప్రాతిపదికన తాత్కాలికంగా వంతెన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 పోలీసులు స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి మరమ్మతులు చేశారు. ఆరు గ్రామాలకు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయిన కోటపల్లి సీఐ తెలిపారు. తమ కష్టాన్ని విని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.