ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మున్సిపల్ టౌన్ లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ టౌన్ లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి అభివృద్ధికి ఎటువంటి నిధులు తేలేదని, కేంద్రం నిధులు మాత్రమే ఎల్లారెడ్డి లో వినియోగించారని విమర్శించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ లో ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులు ఆగిపోవడం ఎమ్మెల్యే పనితీరును తెలుపుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, రాజేశ్, దేవేందర్, బాలకిషన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
