- హార్వర్డ్ వర్సిటీలో సీఎం స్పీచ్‌ను హేళన చేయడంపై బల్మూరి ఫైర్
హైదరాబాద్, వెలుగు: హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ విజన్‌ను చెప్పి, అక్కడి మన తెలుగు విద్యార్థు లను ఆకట్టుకుంటే.. దానిని హేళన చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడ డం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్.. మీలా విదేశాల్లో యూని వర్సిటీ ప్రోగ్రామ్‌ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ కల్చర్‌ను ప్రమోట్ చేయలేదని సోమ వారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
గత పదేండ్లుగా విదేశాల్లో తిరిగిన నువ్వు తెలంగాణకు ఒరగబెట్టిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణకు కేసీఆర్‌ను పిలిస్తే.. తెలంగాణ అస్థిత్వాన్ని టచ్ చేసినట్లు మాట్లాడిన కేటీఆర్, పదేండ్లు మీకు అధికారమిస్తే ఈ రాష్ట్ర అస్థిత్వాన్ని దెబ్బతీయలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు.
