తెలంగాణ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష: జీవన్ రెడ్డి

తెలంగాణ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష: జీవన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నాయన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  ఈ రోజు గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన… ఇటు సిఎం కేసీఆర్ అటు బీజేపీ సర్కార్ లు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్ లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని అందుకేజాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రం చెబుతుందన్నారు జీవన్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా ఇవ్వమని అడగడం ఎవరిని మోసం చేస్తున్నట్లు అని రాష్ట్ర సర్కార్ పై ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి.  కేసీఆర్ డీపీఆర్ కేంద్రానికి పంపి ఉంటే.. రాజ్యసభలో కేంద్రంపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయండని చెప్పారు.  ఇందుకు గాను..  పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు జీవన్ రెడ్డి. లేదంటే.. కాళేశ్వరం కు జాతీయ హోదా తీసుకురాలేకపోవడానికి కేసీఆర్ నైతికబాద్యత వహించాలని అన్నారు.