ప్రాజెక్టులు ఒప్పించి కట్టాలి..బందోబస్తు మధ్యకాదు:జీవన్‌రెడ్డి

ప్రాజెక్టులు ఒప్పించి కట్టాలి..బందోబస్తు మధ్యకాదు:జీవన్‌రెడ్డి

సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఇంజినీర్లు చెప్పినట్లు కాకుండా కేసీఆర్ చెప్పినట్లు జరుగుతుందని అన్నారు.  కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఆయన ఇంట్లో పరామర్శించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి..  నర్సారెడ్డి కుటుంబీకుల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆయన ఇంట్లో కూడా నిరసన తెలిపే హక్కు నర్సారెడ్డికి లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆనాడు … ప్రాజెక్టులు వద్దనే వారితో చర్చించి.. ఒప్పించి నిర్మాణాలు చేసిందని అన్నారు జీవన్ రెడ్డి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల పహారాలో ప్రాజెక్టులు నిర్మిస్తోందని విమర్శించారు.