ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో బోనాలకు కవిత

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో బోనాలకు కవిత

హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో నిర్వహించే బోనాల పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. శనివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్​లో, ఆదివారం న్యూజిలాండ్​లోని ఆక్లాండ్​లో బోనాల పండుగలో ఆమె పాల్గొంటారు. భారత జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో బ్రిస్బేన్​లోని గాయత్రి మందిరంలో అక్కడి మంత్రులు, ఎంపీలు, తెలంగాణ ఎన్ఆర్ఐలతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొంటారు. 

ఆక్లాండ్​లోని గణేశ్​టెంపుల్​లో తెలంగాణ సెంట్రల్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నారు. అక్కడే ప్రవాస భారతీయుల సమ్మేళనంలోనూ కవిత పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఆల్బర్ట్ ​వార్ ​మెమోరియల్​ హాల్​లో తెలంగాణ అసోసియేషన్​ ఆఫ్ ​న్యూజిలాండ్ ​ఏర్పాటు చేసిన ‘మీట్ ​అండ్ ​గ్రీట్’లో పాల్గొంటారు.