ఉచిత బస్సు అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న బస్సులు వాడుతుర్రు : కవిత

ఉచిత బస్సు అని చెప్పి  గత ప్రభుత్వంలో ఉన్న బస్సులు వాడుతుర్రు : కవిత

ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి గతం ప్రభుత్వంలో ఉన్న బస్సులను వాడుతున్నారని విమర్శించారు.  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆత్మ స్థుతి-పరనింద అని అన్నారు. గత ప్రభుత్వాన్ని నిందిచడం కోసమే బడ్జెట్ పెట్టారని ఆరోపించారు.  ఆరు గ్యారింటీల పై సరైన స్పష్టత లేదని బడ్జెట్ లో ఆరు గ్యారెంటిలకు సరిపడ బడ్జెట్ పెట్టలేదన్నారు. 

మహా లక్ష్మ స్కీంలో భాగంగా  తులం బంగారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని కవిత తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగాయని చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు కు సాధ్యం కానీ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కవిత విమర్శించారు.  ప్రతి రోజు ప్రజలను ముఖ్యమంత్రి కలుస్తారని ప్రజావాణి పెట్టాని ఒక్క రోజు మాత్రమే కలిశారని కవిత అన్నారు. ఆ తరువాత ఇద్దరు, ముగ్గురు మంత్రులు ప్రజావాణిలో ఉన్నారని చివరకు ఐఏఎస్ లే ప్రజావాణిలో ఉంటున్నారని చెప్పారు. 

ప్రజా వాణి వింటా అని కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ వాణి వింటున్నారని విమర్శించారు. కౌన్సిల్ గౌరవ మర్యాదలను కించ పరిచిన సీఎం తన మాటలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు తెలంగాణ బస్సులను పెట్టారని కవిత ఆరోపించారు.