
మనీలాండరింగ్ చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి బిగించి శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం కారు ఎక్కాక భర్తను హత్తుకొని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
ఈడీ అధికారులతో కారులో వెళ్తూ కార్యకర్తలకు అభివాదం చేశారు కవిత . విక్టరీ సింబల్ చూపించారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఈడీ వాహనాన్ని అనుసరిస్తూ కేటీఆర్ హరీష్ రావు, కవిత భర్త అనిల్ కూడా వేరే కారులో బయలుదేరారు. లాయర్లతో కలిసి వారు ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని చెప్పారు. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని కవిత తెలిపారు.