మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తాం..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తాం..

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ అమోదం తెలపడాన్ని ఆమె స్వాగతించారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద మహిళలతో కలిసి పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.

ALSO READ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ బిల్లును దాయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్  కృషి ఉందన్నారు. ఇటీవల కూడా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని గుర్తు చేశారు. బలమైన పార్టీల డిమాండ్‌ వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.