
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన కుంటుబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 2023 జూలై 06న గుర్రంగూడ లో నివాసం ఉండే సాయిచంద్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.
సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అతని అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కవిత వద్ద సాయిచంద్ భార్య బోరున విలపించారు. కవిత కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సాయిచంద్ తో ఉన్న సానిహిత్యాన్ని కవిత గుర్తుచేసుకున్నారు.
మొట్టమొదటిసారిగా శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు సాయిచంద్ పాడిన పాట ప్రపంచాన్ని కదిలించిందని ఆమె అన్నారు. బీఆర్ఎస్ కుటుంబమంతాసాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటామని కవిత తెలిపారు.
అటు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిచంద్ కుటుంబీకులను ఓదార్చి అతని భార్య,పిల్లలకు ధైర్యం చెప్పారు.