సింగరేణిని కేసీఆరే కాపాడిండు: ఎమ్మెల్సీ కవిత

సింగరేణిని కేసీఆరే కాపాడిండు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: సింగరేణి విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్​కు గిఫ్ట్​గా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. సింగరేణి స్కూళ్లలో కాంట్రాక్ట్​ పద్ధతిలో పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్​ ఆదివారం హైదరాబాద్​లో కవితను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి సింగరేణిని కాపాడారని చెప్పారు. 

టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై సీఎంతో చర్చిస్తానని, అవసరమైతే సీఎం, సింగరేణి కార్మిక నాయకులతో సమావే శం ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. కవితను కలిసిన వారిలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి, సంఘం నాయకులు ఉన్నారు.