సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్​ పోటీ చేస్తది: కవిత

సింగరేణి ఎన్నికల్లో  టీబీజీకేఎస్​ పోటీ చేస్తది: కవిత
  •     ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటన 

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్​సీఎంగా ఉన్నప్పుడే సంస్థను పరిరక్షించేందుకు, కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని చెప్పారు. కార్మికులు ఆత్మసాక్షిగా ఓటేసి టీబీజీకేఎస్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్​ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 20 వేల డిపెండెంట్​ఉద్యోగాలు ఇచ్చి యువతకు అవకాశాలు కల్పించామన్నారు. డిపెండెంట్​ఉద్యోగం వద్దనుకునే కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించామని వివరించారు. కార్మికుని కుటుంబంలోని మహిళలకు డిపెండెంట్​ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్​కు దక్కుతుందని వెల్లడించారు.