కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌‌ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని, దీనికి సంబంధించి మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుందని తెలిపారు. ఈ సంస్కరణలు రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్సీ కవితకు కరోనా
ఎమ్మెల్సీ కవిత కరోనా బారిన పడ్డారు. దగ్గు, స్వల్ప జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో సోమవారం పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌‌గా తేలినట్లు ఆమె ట్విట్టర్​లో తెలిపారు.