ఆదిలాబాద్: వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుండ బద్దలు కొట్టారు. ఇక్కడి సమస్యలు చూస్తే పోటీ చేయాలని పిస్తోందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన సమస్యలున్నాయని చెప్పారు. ఇక్కడి అభివృద్ధి చూస్తే 15, 16వ శతాబ్దంలో ఉన్నట్టుగా అనిపిస్తోందని చెప్పారు. ప్రకృతి వనరులకు నిలయమైన ఆదిలాబాద్ బాగా వెనుకబడి పోయిందని అన్నారు. ఇక్కడి సమస్యలపై గట్టి పోరాటం చేస్తానని అన్నారు. చట్ట సభల్లో పోరాడి అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. సాగు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతం పెంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న ట్టు కవిత చెప్పారు.
ఆదిలాబాల్ లో చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఒక్కటి కూడా లేవన్నారు. సమస్యలకు పరిష్కారం తెలంగాణ రావడం అనుకున్నాం..రాష్ట్రం వచ్చాక కూడా కొన్ని సమస్యలున్నాయని చెప్పారు. పంచాయతీ గ్రామాల్లో రేషన్ షాపులు కూడా లేవన్నారు. ప్రైవేట్ కాలేజీలకు వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు కవిత.కాంగ్రెస్ నేతలకు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ఉన్న శ్రద్ధ..పత్తి రైతులపై లేదని విమర్శించారు.
