కవితకు వారం రోజుల ఈడీ కస్టడీ

కవితకు వారం రోజుల ఈడీ కస్టడీ

లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు వారం రోజుల.. ఈడీ కస్టడీకి ఇస్తూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. వాదనల తర్వాత ఈడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ పై విచారణ చేసిన కోర్టు.. వారం రోజులు ఈడీ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. 2024, మార్చి 23వ తేదీ తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఈడీని ఆదేశించింది కోర్టు.

కవిత కస్టడీ కోసం ఈడీ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కాం సూత్రాదారుల్లో కవిత ఒకరని.. కుట్రదారు, లబ్ధిదారు కూడా అని ఈడీ తన కస్టడీ పిటీషన్ లో స్పష్టం చేసింది. కవిత సౌత్ కు చెందిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, శ్రీనివాసుల రెడ్డితో పాటు ఆప్ లీడర్లతో కలిసి కుట్రకు పాల్పడ్డారని తన రిపోర్టులో వెల్లడించింది. ఢిల్కీ లిక్కర్ పాలసీతో ప్రయోజనం పొందేందుకు 100 కోట్ల రూపాయల ముడుపులు అందించారని..  కొంతమంది మధ్యవర్తులతో ముడుపులు చెల్లించేందుకు కేజ్రీవాల్, సిసోడియాతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లు ఈడీ తన కస్టడీ పిటీషన్ లో వెల్లడించింది. ముడుపులకు బదులుగానే ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో కవితకు ఈజీగా వాటా దక్కించుకుందని స్పష్టం చేసింది ఈడీ. 

కవిత తన బినామీ పిళ్లై ద్వారా లిక్కర్ కంపెనీ ఇండో స్పిరిట్స్ లో, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ పెర్నాడ్ రికర్డ్ లో పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే వాటాలు తీసుకున్నట్లు ఈడీ తన కస్టడీ పిటీషన్ లో స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీలో ప్రాఫిట్ మార్జిన్ పెంచడం వల్ల భారీగా పెరిగిన లాభాల్లో వాటానే ముడుపులుగా చెల్లించారని.. సౌత్ మెంబర్స్ తో కలిసి కవిత 100 కోట్ల లంచాలు చెల్లించడానికి ఆధారాలున్నాయని కూడా ఈడీ తన రిపోర్టులో రాసుకొచ్చింది. 2021 మార్చిలో కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ బిజినెస్ చేయడానికి తనను కలిసినట్లు కేజ్రివాల్ చెప్పారని.. లిక్కర్ బిజినెస్ చేసే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంలో చెప్పారని.. ఆమె ఆప్ కు 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిందనీ, ఈ బిజినెస్ గురించి ఆమెతో మాట్లాడాలని కేజ్రివాల్ చెప్పినట్లు మాగుంట స్టేటమెంట్ లో ఉన్నట్లు ఈడీ తన కస్టడీ పిటీషన్ లో స్పష్టం చేసింది.