కవితకు తొమ్మిది రోజుల జ్యూడిషియల్ కస్టడీ

కవితకు తొమ్మిది రోజుల జ్యూడిషియల్ కస్టడీ

 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు MLC కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.  ఢిల్లీ లిక్కర్ కేసులో మూడు రోజుల కస్టడీ అనంతరం ఏప్రిల్ 15వ తేదీ సోమవారం ఉదయం సీబీఐ, కవితను కోర్టులో హాజరుపర్చింది. కవితను ఇంకా విచారించాల్సి ఉందని..అందుకు14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ. అయితే 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది ట్రయల్ కోర్టు. దీంతో ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు.  రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో శుక్రవారం సాయంత్రం కవితను కస్టడీకి తీసుకున్నన సంగతి తెలిసిందే. శని, ఆదివారాల్లో ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 

ఇక నిన్న ఢిల్లీలో సీబీఐ హెడ్ ఆఫీస్ లో కవితతో ములాఖత్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమార్.  కవిత ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసు విషయాలపై ఇరువురు ఆరా తీశారు. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత.. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.  సౌత్ గ్రూపునలకు ముడుపుల విషయంతో పాటు..కీలక విషయాలు రాబడుతున్నారు. లిక్కర్ కేసులో కవితే అసలైన సూత్రధారిగా ఈడీ,సీబీఐ భావిస్తోంది. బెయిల్ ఇవ్వొద్దని ఇప్పటికే న్యాయస్థానాల్లో  ఈడీ,సీబీఐ వాదిస్తోంది.