కొత్త సచివాలయం ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

 కొత్త సచివాలయం ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్ కు మరో తలమానికంగా నిలిచింది కొత్త సచివాలయం. హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర నూతన సచివాలయం కనువిందు చేస్తోంది. రాజుకాలం నాటి కోటను తలపిస్తోంది. కొత్త సచివాలయంకు సంబంధించిన ఫోటోలు చూస్తే ఎవరైనా అదరహో అనాల్సిందే.. తాజాగా సెక్రటేరియట్ ఫోటోలను ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో షేర్ చేశారు. నూతన సచివాలయం తెలంగాణ ప్రజల ఉనికికి, ప్రగతికి, అభివృద్ధికి పర్యాయపదంగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని కవిత తెలిపారు. ప్రస్తుతం కవిత షేర్ చేసి ఫొటోలు వైరల్ అయ్యాయి. 

తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. సచివాలయ నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు. కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపిస్తోంది. ఇక ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం  కల్పించారు.