గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా?: ఎమ్మెల్సీ కవిత

గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా?: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: ‘‘గ్యారంటీలు ఇచ్చేందుకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా..’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్​లో ప్రశ్నించారు. అమరవీరులపై కాంగ్రెస్ ​సీనియర్​ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సోనియా, రాహుల్​ గాంధీ అమరవీరుల స్తూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదన్నారు. 

అమరవీరుల తల్లుల కడుపుకోత పదేండ్లలో గాంధీ కుటుంబానికి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. 6 దశాబ్దాలు తెలంగాణను మోసం చేసిన గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పడం రాదా? అని నిలదీశారు. ఈ రోజుకూ గాంధీ కుటుంబానికి అమరుల స్తూపానికి దారి తెలియకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.