మహిళా బిల్లుకు ఆమోదం లభించేలా చూడండి : ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లుకు ఆమోదం లభించేలా చూడండి : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత బీజేపీని కోరారు. తెలంగాణలో మహిళలకు బీఆర్ఎస్ తక్కువ సీట్లు కేటాయించడం, మరోవైపు ఢిల్లీలో మహిళా రిజర్వేషన్​ల కోసం కవిత చేసిన ఆందోళనపై తెలంగాణ బీజేపీ ట్వీట్​ చేసింది. దీనిపై ఆమె ట్విట్టర్​లో ఘాటుగా స్పందించారు. 

వ్యక్తిగత దూషణ బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కాలం చెల్లిన మూస పద్ధతుల్లో హేళన చేయడం తగదని, మహిళలు ఉన్నతస్థానాలకు చేరుకోవడాన్ని బీజేపీ ఓర్వలేకపోతుందా అని ప్రశ్నించారు. ఇతరులపై నిందలు వేయడం మాని పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపజేయడంపై దృష్టి పెట్టాలని కవిత అన్నారు.