గ్యాస్​ ధర రూ.800 పెంచి 200లే తగ్గిస్తరా.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్

గ్యాస్​ ధర రూ.800 పెంచి 200లే తగ్గిస్తరా.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్
  • గ్యాస్​ ధర రూ.800 పెంచి 200లే తగ్గిస్తరా
  • గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్

హైదరాబాద్, వెలుగు : వంట గ్యాస్​ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు స్వల్పంగా ధర తగ్గించి అదేదో గొప్పగా చెప్పుకుంటున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గ్యాస్​సిలిండర్ల ధర తగ్గింపుపై మంగళవారం ఆమె ట్వీట్​చేశారు. ధర తగ్గించడం కానుక కాదని జేబులను గుల్ల చేసి దగా చేయడమన్నారు. పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్​సిలిండర్​ధర రూ.800 పెంచిందని, ఇప్పుడు రూ.200 మాత్రమే తగ్గించిందన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడానికే కేంద్రం నామమాత్రంగా ధర తగ్గించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.