ఢిల్లీ లిక్కర్ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన లాయర్ల ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో సోమవారం ఉదయం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో తన ప్రమేయం లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని..  తన ప్రమేయంపై ఆధారాలు లేవని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రతివాదుగా చేర్చారు.

కాగా, హైదరాబాద్ లో కవిత నివాసంపై దాడులు చేసిన ఐటి, ఈడీ అధికారులు.. ఆమెను అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు.  అనంతరం మరుసటి రోజు కవితకు వైద్య పరీక్షలు చేసి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. దీంతో  లిక్కర్ కేసులో కవితకు ఏడు రోజుల రిమాండ్ విధిస్తూ ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ క్రమంలో కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు కవితను  విచారించి.. ఆమె స్టెట్ మెంట్ రికార్డు చేయనున్నారు. వారం రోజుల కస్టడీ అనంతరం తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.