నా పర్సనల్ ఫోన్ నెంబర్లు డిస్ ప్లే చేస్తున్రు.. జడ్జికి కవిత 4 పేజీల లేఖ

నా పర్సనల్ ఫోన్ నెంబర్లు డిస్ ప్లే చేస్తున్రు.. జడ్జికి కవిత 4 పేజీల లేఖ

లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు BRS MLC కవిత. లిక్కర్ బిజినెస్ లో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని చెప్పారు. లిక్కర్ కేసు, ఇతర అంశాలకు సంబంధించి ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ కు 4 పేజీల లేఖ రాశారు కవిత. లిక్కర్ కేసులో తాను బాధితురాలినని చెప్పారు. రెండున్నరేళ్లుగా ఈడీ, సీబీఐ కేసు కొనసాగుతూనే ఉందన్నారు కవిత. కేసుపై మీడియాలో ట్రయల్ జరుగుతోందన్నారు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలా నష్టం జరుగుతోందని లేఖలో వివరించారు కవిత.  

తన అనుమతి లేకుండా పర్సనల్ ఫోన్ నెంబర్లు డిస్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు కవిత. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చానని లేఖలో వివరించారు. బ్యాంకులు, బిజినెస్ డిటైల్స్ అన్నీ దర్యాప్తు సంస్థలకు ఇచ్చానన్నారు. తన ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థలకు ఇచ్చానని... ఐనా ఫోన్లు ధ్వంసం చేశానని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు కవిత. ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేయటం కుట్రపూరితమన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో 95% విపక్ష నేతలపైనే ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలన్నీ న్యాయవ్యవస్థవైపే చూస్తున్నాయని చెప్పారు. ఓ తల్లిగా తన కుమారుడి బాధ్యత నాపై ఉందన్నారు. తాను లేకుంటే కుమారుడి భవిష్యత్ పై ప్రభావం చూపుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని బెయిలివ్వాలని లేఖలో మేజిస్ట్రేట్ ను కోరారు కవిత.