ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కవిత.

కవిత కాలికి గాయం.. మూడు వారాల విశ్రాంతి ట్విట్ తో సోషల్ మీడియాలో రకరకాలు కామెంట్లు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్నారు కవిత. ఇంకా పూర్తి కాలేదు విచారణ. ఈడీ మళ్లీ నోటీసులు ఇవ్వొచ్చు అనే వార్త క్రమంలో కాలికి గాయం కావటం.. మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన క్రమంలో.. ఇప్పట్లో లిక్కర్ స్కాం విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ

https://twitter.com/RaoKavitha/status/1645676403294375936