వృద్ధులు భద్రతతో జీవించేలా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ కోదండరాం

వృద్ధులు భద్రతతో జీవించేలా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ కోదండరాం
  •     ఎమ్మెల్సీ కోదండరాం

ఉప్పల్, వెలుగు: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  సోమవారం తార్నాకలో ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం చీఫ్​గెస్ట్​గా హాజరై, మాట్లాడారు. వృద్ధులు హక్కులను రక్షిస్తూ వారు గౌరవంగా, భద్రతతో జీవించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. 

అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరసింహారావు, సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ.. సీనియర్​ సిటిజన్స్​కోసం వేధింపుల నిరోధక చట్టం ఉన్నా.. అమలులో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు వృద్ధులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.