ప్రపంచం మెచ్చేలా విద్యా విజన్ ఉండాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

ప్రపంచం మెచ్చేలా విద్యా విజన్ ఉండాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • గ్లోబల్ సమిట్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి సూచన 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యా వ్యవస్థ స్థాయిని ప్రపంచ దేశాలు గుర్తించేలా ‘గ్లోబల్ సమిట్’లో విద్యా విజన్ డాక్యుమెంట్ ఉండాలని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని, దానికి తగ్గట్టు మన విద్యా విధానంలోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్లోబల్ సమిట్​ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆయన సోమవారం ఒక ప్రకటనలో పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం స్కిల్స్ లేకపోవడమేనని శ్రీపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్ర విద్యా వ్యవస్థకు కనెక్ట్ చేయగలిగితే ఈ సమస్య తీరుతుందని చెప్పారు. 

రాష్ట్రంలో అపారమైన మానవ వనరులు, మౌలిక వసతులు ఉన్నాయన్న విషయాన్ని ఈ సమిట్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. అప్పుడే విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు వచ్చి, మన విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందన్నారు. భవిష్యత్ విద్యా విధానం ఎలా ఉండాలనే దానిపై క్షేత్రస్థాయిలో ఉండే అనుభవజ్ఞులైన టీచర్ల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే గ్లోబల్ సమిట్ ఆశించిన ఫలితాలిస్తుందని స్పష్టం చేశారు.