ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం

ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం

ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం ఆమె అసెంబ్లీ స్పీకర్ ను కలిసేందుకు అసెంబీకి వచ్చారు. వాణిదేవిని మండలి దగ్గర డ్రాప్ చేసి కారును పార్క్ చేస్తుంగా... అసెంబ్లీ 8వ నెంబర్ గేట్ ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. కారు టైర్ పేలి పెద్ద శబ్దం రావడంతో పోలీసులు అలర్టయ్యారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.  అతి వేగంగా కారును పార్క్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్‌మెన్ కారు నడిపాడు. కారు డ్రైవ్ చేసిన గన్ మెన్ ను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు.