రోడ్లపై ర్యాంపులు కడితే కూలగొడ్తం : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

రోడ్లపై ర్యాంపులు కడితే కూలగొడ్తం : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్లపై ర్యాంపులు నిర్మిస్తే కూలగొడతామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం  అధికారులతో కలిసి అల్వాల్ లోతుకుంట, గోల్నాక, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. లోతుకుంటలో కొంతమంది ఇండ్ల యజమానులు రోడ్ల మీదకు ర్యాంపులు కట్టి, దారిని ఆక్రమించుకోడాన్ని చూసిన కమిషనర్ సీరియస్ అయ్యారు.

వెంటనే వాటిని తొలగించి, రోడ్లను క్లియర్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. గోల్నాకలో సమ్మర్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ ను సందర్శించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన కమిషనర్..అక్కడ వంటల రుచిని, శుభ్రతను పరీక్షించారు. అల్వాల్ చెరువు చుట్టుపక్కల ఫాగింగ్ పెంచాలన్నారు.